MS Dhoni | విమానంలో క్యాండీ క్రష్ ఆడిన ధోనీ.. చాక్లెట్లు ఆఫర్ చేసిన ఎయిర్‌హోస్టెస్
MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhon)కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. మైదానంలోనే కాదు బయట కూడా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ మిస్టర్ కూల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ ఏం చేశాడో తెలుసా..? విమానంలో ఎంచక్కా క్యాండీ క్రష్(Candy Crush) ఆడుతున్నాడు. అంతలోనే ఒక ఎయిర్‌హోస్టెస్(Air Hostess ) అతడికి దగ్గరకు...
MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhon)కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. మైదానంలోనే కాదు బయట కూడా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ మిస్టర్ కూల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ ఏం చేశాడో తెలుసా..? విమానంలో ఎకానమీ క్లాస్‌లో వెళ్తూ ఎంచక్కా క్యాండీ క్రష్(Candy Crush) ఆడుతున్నాడు. అంతలోనే ఒక ఎయిర్‌హోస్టెస్(Air Hostess ) అతడికి దగ్గరకు వచ్చింది. డెయిరీ మిల్క్, ఇతర రకాల చాక్లెట్లు ఆఫర్ చేసింది. ఆమెను చూసి చిన్నగా నవ్విన ధోనీ.. చిన్నచాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాడు.
ఇదంతా ఒక ప్రయాణికుడు వీడియో తీసి ట్విట్టర్లో పెట్టాడు. వీడియో చూసిన అభిమానులు ధోనీని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ‘మిగతా క్రికెటర్లు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తారు. కానీ, తాలా మాత్రం ఎకానమీ క్లాస్‌లో వెళ్తున్నాడు. సాదాసీదాగా ఉంటాడనే దానికి ధోనీ నిజమైన ఉదాహారణ’ అని కామెంట్లు పెడుతున్నారు.
MS Dhoni – the crowd favourite. pic.twitter.com/ltpud9P9Jj
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023
అనుభవం లేని ఆటగాళ్లతో..
ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో ధోనీ తన మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఆ పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతోనే చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో రవీంద్ర జడేజా (11 నాటౌట్) సంచలన ఆటతో చెన్నైకి కప్పు అందించాడు. దాంతో, ధోనీ సేన ఐదో సారి ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించి ముంబై ఇండియన్స్ రికార్డు సమం చేసింది. ఫైనల్ తర్వాత ధోనీ ముంబైలో మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ సక్సెస్ అయ్యాక ఫ్యామిలీతో కలిసి సొంత రాష్ట్రం జార్ఘండ్‌కు వచ్చేశాడు. పదహారో సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 182.45 స్ట్రైక్ రేటుతో 104 పరుగులు చేశాడు. ఆడింది కొన్ని బంతులే అయినా ధనాధన్ ఆటతో ఫ్యాన్స్‌ను అలరించాడు.
ఇవి కూడా చదవండి
Carlos Alcaraz | నంబర్ 1 స్థానం కోసం అతడితో పోటీ పడడం బాగుంది : అల్కరాజ్
Vinesh Phogat | ట్రయల్స్‌ను వాయిదా వేయాలని మాత్రమే కోరాం.. కేంద్ర మంత్రికి రాసిన లేఖ ఇదిగో : వినేశ్ ఫోగట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

