Carlos Alcaraz : టెన్నిస్ పురుషల సింగిల్స్‌లో ప్రస్తుతం నొవాక్ జకోవిచ్(Novac Djokovic), నయా సంచలనం కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) హవా నడుస్తోంది. వీళ్లలో ఎవరో ఒకరు కొన్ని రోజులుగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నారు. అభిమానుల్లో ఆసక్తి పెంచిన ఈ నంబర్ 1 రేసు గురించి రెండో సీడ్ అల్కరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నంబర్ 1 స్థానం కోసం నొవాక్ జకోవిచ్‌తో పోటీ పడడం చాలా బాగుందని అన్నాడు.
క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షిప్(Queen’s Club Championship) ఫైనల్ ఫైట్‌కు సిద్ధమవుతున్న అతను ఏం చెప్పాడంటే..? ‘టాప్ సీడ్ కోసం నేను పెద్దగా ఆలోచించడం లేదు. అయితే.. జకోవిచ్‌తో పోటీపడడం నాకు చాలా ఉపయోగపడుతోంది. ఇది ఒకరకంగా నాకు అదనపు మోటివేషన్. నంబర్ 1 స్థానం కోసం నాకు, జకోవిచ్ మధ్య అందమైన పోటీ జరుగుతోందని అనుకుంటున్నా. అయితే.. నంబర్ 1 ఆటగాడిగా వింబుల్డన్(Wimbledon) టోర్నమెంట్లో బరిలోకి దిగాలనేది నా కల’ అని ఈ స్పెయిన్ స్టార్ తెలిపాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్ ఓటమితో అల్కరాజ్ మొదటి ర్యాంక్ కోల్పోయాడు. మరోవైపు.. టైటిల్ నెగ్గిన జకోవిచ్ వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.
It all comes down to this! 🤺
Who will capture the @QueensTennis title: Carlos Alcaraz or Alex de Minaur? 🏆#CinchChampionships pic.twitter.com/2ohC6e3rDe
— ATP Tour (@atptour) June 25, 2023
అయితే.. జకోను వెనక్కినెట్టేందుకు అల్కరాజ్ ముందు సువర్ణావకాశం ఉంది. క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో గెలిస్తే అతను మళ్లీ అగ్రస్థానానికి చేరతాడు. టైటిల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డీ మినౌర్(Alex de Minaur)ను అల్కరాజ్ ఢీ కొట్టనున్నాడు. అతను క్వీన్స్ క్లబ్ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు బోరిస్ బెకర్(1985), లీటన్ హెవిట్(2000), జాన్ మెకన్రో(1978), జిమ్మీ కోనర్స్(1972) ఈ ఫీట్ సాధించారు.