Vinesh Phogat | ట్రయల్స్‌ను వాయిదా వేయాలని మాత్రమే కోరాం.. కేంద్ర మంత్రికి రాసిన లేఖ ఇదిగో : వినేశ్ ఫోగట్
Protesting Wrestlers : ఆసియా గేమ్స్ ట్రయల్స్(Asian Games Trails) నుంచి ఆరుగురు రెజ్లర్లకు మినహాయింపు ఇవ్వడంపై దుమారం రేగుతోంది. ఆందోళనతో లాభపడాలని చూస్తున్నారంటూ వినేశ్ ఫోగట్(Vinesh Phogat), భజ్రంగ్ పూనియా(Bajrang Punia)తోసహా మిగతా నలుగురిపై తోటి రెజ్లర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో, వాళ్ల నోళ్లు మూయించేందుకు వినేశ్ ఫోగట్ బృందం స్పందించింది. తాము ఆసియా గేమ్స్ ట్రయిల్స్‌ను వాయిదా వేయాలని మాత్రమే
Vinesh Phogat: ఆసియా గేమ్స్ ట్రయల్స్(Asian Games Trails) నుంచి ఆరుగురు రెజ్లర్లకు మినహాయింపు ఇవ్వడంపై దుమారం రేగుతోంది. ఆందోళనతో లాభపడాలని చూస్తున్నారంటూ వినేశ్ ఫోగట్(Vinesh Phogat), భజ్రంగ్ పూనియా(Bajrang Punia)తోసహా మిగతా నలుగురిపై తోటి రెజ్లర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో, వాళ్ల నోళ్లు మూయించేందుకు వినేశ్ ఫోగట్ బృందం స్పందించింది. తాము ఆసియా గేమ్స్ ట్రయిల్స్‌ను వాయిదా వేయాలని మాత్రమే కోరామని, మినహాయింపు ఇవ్వాలని అడగలేదని తేల్చి చెప్పింది. అందుకు సాక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur)కు రాసిన లేఖను వినేశ్ ఫోగట్ తన ట్విట్టర్లో పెట్టింది.
‘ఆందోళనలో పాల్గొనడడం కారణంగా ఆరు నెలలుగా మేము రెజ్లింగ్ సాధన చేయలేదు. అందుకని ఆసియా గేమ్స్ ట్రయల్స్‌ను వాయిదా వేయాలని క్రీడల మంత్రికి ఉత్తరం రాశాం’ అని ఫోగట్ తన ట్వీట్లో తెలిపింది. అంతేకాదు తమపై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితో రెజ్లింగ్‌ను వదిలేస్తామని కూడా స్పష్టం చేసింది.
हम आंदोलित पहलवानों ने ट्रायल्स को सिर्फ़ आगे बढ़ाने के लिए चिट्ठी लिखी थी, क्योंकि पिछले 6 महीने से आंदोलन में शामिल होने के कारण हम प्रैक्टिस नहीं कर पाए.
इस मामले की गंभीरता को हम समझते हैं इसलिए यह चिट्ठी आपसे साझा कर रहे. दुश्मन पहलवानों की एकता में सेंध लगाना चाहता है.… pic.twitter.com/Otvhhu1Z75
— Vinesh Phogat (@Phogat_Vinesh) June 25, 2023
ఉద్యమానికి బ్రేక్
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు వినేష్ ఫోగట్ నేతృత్వంలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదుకావడంతో రెజ్లర్లు ఉద్యమానికి బ్రేక్ ఇచ్చారు. ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు తమను అనుమతించాలని క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిశారు. దాంతో, ట్రయల్స్ నుంచి వినేశ్ ఫోగట్(Vinesh Phogat), భజ్రంగ్ పూనియా(Bajrang Punia), సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియన్, జితేందర్ కిన్హలకు ఒలింపిక్ సంఘం(Indian Olympic Association) అడ్ హక్ కమిటీ(ad hoc committee) మినహాయింపు ఇచ్చింది.
భజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్

ఒకే ఒక బౌట్
ఆగస్టులో నిర్వహించనున్న ఒకే ఒక బౌట్లో పోటీ పడేందుకు వీళ్లకు అనుమతించింది. దాంతో, ఆయా విభాగాల్లోని ట్రయల్స్ విజేతలతో ఈ ఆరుగురు పోటీ పడితో సరిపోతుందని చెప్పింది. ఆగస్టు 5 నుంచి 15 వరకు ఈ ఆరుగురికి పోటీలు నిర్వహిస్తామని అడ్ హక్ కమిటీ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ బజ్వా(Bhupender Singh Bajwa) తెలిపాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

