CSK | చెన్నై : ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌కు దిగ్గజ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం కనిపిస్తున్నది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోకపోతే ధోనీ సారథ్య బా ధ్యతలు అందుకునే చాన్స్ ఉంది. శుక్రవారం జరిగిన మీడియా భేటీలో చెన్నై బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ స్పందిస్తూ వికెట్ల వెనుక యువకునిలా కీపింగ్ చేస్తున్న వ్యక్తి అయితే బాగుంటుందని పేర్కొన్నాడు. ధోనీ, జడేజా తర్వాత.. రుతురాజ్ ప్రస్తుతం చెన్నై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.