దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. శుక్రవారం 33వ బర్త్‌డే జరుపుకున్నాడు. స్కాట్లాండ్పై స్వీట్ విక్టరీ కొట్టిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ సెలబ్రేషన్స్ జరిగాయి. కోహ్లీ కేక్ కట్ చేస్తున్న సమయంలో.. మెంటర్, మాజీ కెప్టెన్ ధోనీ ఆ వేడుకల్లో పాల్గొన్నాడు. కేక్ కట్ చేసే తొందర్లో బర్త్‌డే క్యాండిల్స్ బ్లో చేయడం కోహ్లీ మరిచిపోయాడు. ఆ విషయాన్ని మెంటర్ ధోనీ అతనికి గుర్తు చేశాడు. ఆ సమయంలో డ్రెస్సింగ్లోని ప్లేయర్లు నవ్వుకున్నారు. కోహ్లీ కేక్ కట్ చేస్తున్న వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు నెగ్గిన టీమిండియా.. శుక్రవారం స్కాట్లాండ్పై భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తేనే.. ఇండియాకు సెమీస్ వెళ్లే ఛాన్సు ఉంటుంది.
Cake, laughs and a win! 🎂 😂 👏#TeamIndia bring in captain @imVkohli's birthday after their superb victory in Dubai. 👍 👍 #T20WorldCup #INDvSCO pic.twitter.com/6ILrxbzPQP
— BCCI (@BCCI) November 5, 2021