MS Dhoni | పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ధోనీ దంపతులు.. వీడియో
MS Dhoni | భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ లెజెండరీ క్రికెటర్ తన బార్య సాక్షి సింగ్ ధోనీ (sakshi singh dhoni)తో కలిసి తమ పూర్వీకుల ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ధోనీ దంపతులు పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం (Blessings From Elders) తీసుకున్నారు.
MS Dhoni | భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ లెజెండరీ క్రికెటర్ తన బార్య సాక్షి సింగ్ ధోనీ (sakshi singh dhoni)తో కలిసి తమ పూర్వీకుల ఇంటికి వెళ్లాడు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని ల్వాలి (Lwali) గ్రామంలో ఉన్న తమ తాత ముత్తాతల ఇంటిని సందర్శించాడు. అక్కడ బంధువులు, స్థానికులతో సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ధోనీ దంపతులు పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం (Blessings From Elders) తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Most down to earth cricketer @msdhoni for countless reasons.
Here’s the unseen version from the much loved video!! 😇❤️ pic.twitter.com/cMmdT9yVut
— DIPTI MSDIAN (@Diptiranjan_7) November 16, 2023
కాగా, ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను సాక్షి సింగ్ ధోనీ ఇప్పటికే ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలో ధోనీ దంపతులు ఆ ఇంటి ముందు కూర్చొని నవ్వుతూ ఫొటోలు దిగారు. ఆ ఫొటోతో పాటు ఆ ఇంటి వీడియోను కూడా సాక్షి సింగ్ ఆన్లైన్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టీమిండియా గొప్ప కెప్టెన్లలో ధోనీ పేరు ముందువరసలో ఉంటుంది. అతడి సారథ్యంలోనే భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ధోనీ రనౌటయ్యాడు. ఆ క్షణమే ఆటకు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకున్నాడు. అయితే.. 2020 ఆగష్టులో మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 16వ సీజన్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Also Read..
World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు మోదీ, ధోనీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా వాయుసేన విన్యాసాలు
David Beckham | డేవిడ్ బెక్‌హమ్‌కు అంబానీ కుటుంబం ప్రత్యేక ఆతిథ్యం.. పిక్ వైరల్
Hardik Pandya: ఆసీస్‌తో టీ20 సిరీస్.. హార్దిక్ పాండ్యా దూరం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

