హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1కు త్వరలో తెరలేవనుంది. మంగళవారం ఢిల్లీ పబ్లిక్స్కూల్లో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ధోనీ తొలి కోచ్ కేశవ్ బెనర్జీ, క్రికెట్ వ్యాఖ్యాత చంద్రశేఖర్ పాల్గొన్నారు. లీగ్లో ఎనిమిది జట్లు పల్లవి రాయల్స్, డీపీఎస్ వారియర్స్, డామినేటర్స్, స్ట్రయికర్స్, ఫోనిక్స్, స్కార్పియన్స్, నైట్స్, హరికేన్స్ బరిలోకి దిగుతున్నాయి.
షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లు గురువారం నుంచి మొదలుకావాల్సి ఉన్నా..వర్షాల కారణంగా రీషెడ్యూల్ చేసినట్లు టోర్నీ డైరెక్టర్ వెంకట్ పేర్కొన్నారు. లీగ్లో అద్భుత ప్రతిభ కనబరిచిన 10 మంది ప్లేయర్లకు పల్లవి ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు స్కాలర్షిప్తో పాటు ధోనీ అకాడమీలో ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని సీవోవో యశస్వి తెలిపారు.