MS Dhoni | రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని కలిసేందుకు గౌరవ్ కుమార్ అనే అభిమాని ఢిల్లీ నుంచి రాంచీ దాకా సుమారు 1500 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేశాడు. ధోనీని కలుసుకునేందుకు గాను రాంచీలోని ధోనీ ఫామ్‌హౌస్‌కు చేరుకున్న అతడు.. వారం రోజుల పాటు దాని ముందే చిన్న టెంట్ వేసి నిరీక్షించాడు.
తన సోదరుడి ద్వారా విషయం తెలుసుకున్న మహీ ఎట్టకేలకు అతడిని కలిశాడు. ఈ సందర్భంగా ధోనీ అతడికి సంతకం చేసిన జెర్సీని అందించాడు.