MS Dhoni : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) ఎంత కూల్‌గా ఉంటాడో తెలిసిందే. ఐపీఎల్‌లోనూ అద్భుత కెప్టెన్సీతో నీరాజనాలు అందుకున్న మహీభాయ్ అప్పుడప్పుడు ఫన్నీ జోక్స్ కూడా పేలుస్తుంటాడు. తాజాగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ల సంగీత్ వేడుకలో ధోనీ ఓ రిపోర్టర్‌ను ఆశ్చర్యానికి గురి చేశాడు. అసలేం జరిగిందంటే..?
సంగీత్ కోసం సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన ధోనీ.. భార్య సాక్షి సింగ్ (Sakshi Singh)తో కలిసి ఫొటోలకు పోజిచ్చాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా ఓ రిపోర్టర్.. ‘సర్.. రేపే మీ పుట్టిన రోజు’ అని గుర్తు చేశాడు. దాంతో. ఒక్క అడుగు వెనక్కి వేసిన ధోనీ ‘ఐతే గిఫ్ట్ తీసుకొని రా’.. అని నవ్వుతూ బదులిచ్చాడు.
Mahi 😂❤️#MSDhoni pic.twitter.com/oVwXgfSE4E
— Chakri Dhoni (@ChakriDhonii) July 5, 2024
దాంతో, సదరు రిపోర్టర్ తొలుత షాక్ అయినా.. ఆ తర్వాత మహేంద్రుడి కామెడీ సెన్స్ సూపర్ అని అనుకున్నాడు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లు అందించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పిన మహీ జూలై 7న 43వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇక ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ వదిలేసిన ఈ స్టార్ క్రికెటర్ మరో సీజన్ ఆడుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Everyone’s Idol gets Better Farewell but still i feel bad for my Man not getting a proper send off 🛐 #MSDhoni𓃵 pic.twitter.com/gfqNXbMGld
— *𝘑𝘋 × 𝘓𝘋 🥂🚀💢 (@___jaga___16) June 30, 2024
అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ల సంగీత్ వేడుక శుక్రవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకలో పొట్టి ప్రపంచ కప్ విజేతలు రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐసీసీ ట్రోఫీతో స్వదేశం వచ్చిన ఈ ముగ్గురిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ ప్రేమగా హత్తుకొని ప్రశంసించింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
“𝙏𝙤𝙪𝙜𝙝 𝙏𝙞𝙢𝙚𝙨 𝘿𝙤𝙣’𝙩 𝙇𝙖𝙨𝙩, 𝙏𝙤𝙪𝙜𝙝 𝙋𝙚𝙤𝙥𝙡𝙚 𝘿𝙤”👏
Mrs. Nita Ambani summed up Team India’s brilliant campaign as they stood against the odds in the #T20WorldCup and emerged as the undisputed champions. 🏆🇮🇳#MumbaiIndians pic.twitter.com/uPibPmWTGK
— Mumbai Indians (@mipaltan) July 6, 2024