Rahul Gandhi | అయోధ్యలో మాదిరిగానే గుజరాత్లో బీజేపీని ఓడిస్తాం: రాహుల్ గాంధీ
Rahul Gandhi | అయోధ్యలో మాదిరిగానే గుజరాత్లో కూడా బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తనకు దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని మోదీ అన్నారని, అలాంటప్పుడు అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు.
అహ్మదాబాద్: అయోధ్యలో మాదిరిగానే గుజరాత్లో కూడా బీజేపీని ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. తనకు దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని మోదీ అన్నారని, అలాంటప్పుడు అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు. రాజ్‌కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ శనివారం గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో మాదిరిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, రాహుల్ గాంధీ లోక్‌సభలో హిందుత్వపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువజన విభాగం సభ్యులు జూలై 2న అహ్మదాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ‘మమ్మల్ని బెదిరించి, మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ద్వారా వాళ్లు (బీజేపీ) సవాల్ విసిరారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లుగా మేమంతా కలిసి వారి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నాం. రాత పూర్వకంగా తీసుకోండి. అయోధ్యలో చేసినట్లే గుజరాత్‌లోనూ నరేంద్ర మోదీని, బీజేపీని ఓడిస్తాం’ అని అన్నారు. గుజరాత్ నుంచే కొత్త ప్రారంభాన్ని కాంగ్రెస్ ప్రారంభిస్తుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

