Kulgam Encounter | కుల్గామ్ జిల్లా మోడెర్గాంలో భద్రతా బలగాలు, ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో కాల్పులు జరుగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసు, ఆర్మీ9 ఆర్ఆర్, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం ఈ ప్రాంతంలో తీవ్రవాదుల ఉనికి గురించి నిర్ధిష్ట సమాచారం ఆధారంగా కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. సైనికుల ఉమ్మడి బృందాలు అనుమానాస్పద స్థలం వైపు వెళ్లగానే దాక్కున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారని, దాంతో ప్రతీకారంగా ఎన్కౌంటర్కు దారితీసిందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అమర్నాథ్ ప్రారంభమైన తర్వాత జమ్మూ కశ్మీర్లో ఇది మొదటి ఎన్కౌంటర్ కావడం గమనార్హం.