హైదరాబాద్, ఆట ప్రతినిధి: మాన్సూన్ రెగెట్టా టోర్నీలో రాష్ట్ర యువ సెయిలర్ తనూజ కామేశ్వర్ రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన బాలికల అండర్-15 విభాగంలో తనూజ ద్వితీయ స్థానంలో నిలిచి ఆకట్టుకోగా, దివ్యాంశి మిశ్రా, షాగున్ జా వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. బాలుర విభాగంలో శశాంక్ బాతమ్ అగ్రస్థానంలో నిలువగా, ఏకలవ్య బాతమ్, హృతిక్ జైస్వాల్ రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన శశాంక్ బాతమ్..ఎస్హెచ్ బాబు స్మారక ట్రోఫీ విజేతగా నిలిచాడు. పోటీల ముగింపు కార్యక్రమానికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ జర్నల్ కేఎస్ రావు, కెప్టెన్ మనీశ్ సేన్ తదితరులు పాల్గొన్నారు.