హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో ఐదోరోజైన శుక్రవారం పోటీలు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నిర్వహకులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు అగ్రస్థానాల్లో ఉన్నవారికి పతకాలు ఖరారు కాగా, మిగతావారు నిరాశ చెందారు. 12 రేసుల సిరీస్లో ఇంకా నాలుగు రేసులు మిగిలి ఉన్నాయని చాంపియన్షిప్ నిర్వాహకులు పేర్కొన్నారు.
శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే టాప్లో ఉన్న వారికి ట్రోఫీలు అందచేస్తామని వారు తెలిపారు. ఇదిలా ఉంటే ఆసియా క్రీడల ప్రతిభాన్వేషణలో భాగంగా గత రెండు నెలలుగా యాచ్క్లబ్లో శిక్షణ పొందుతున్న తెలంగాణలోని వివిధ గ్రామాలకు చెందిన యువ సెయిలర్లకు సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి సైదులు, ప్రధాన కార్యదర్శి తిరుపతి బహుమతులు అందజేశారు.