Mohsin Naqvi | పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), హోంశాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీకి లండన్‌లో ఘోర అవమానం జరిగింది. బ్రిటీష్ పోలీసులు ఆయన కారును ఆపి సోదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా ఉన్న ఖ్యాతికి అద్దం పడుతున్నది. షాజాద్ అక్బర్, ఆదిల్ రాజా అప్పగింత అంశంపై చర్చించేందుకు నఖ్వీ బ్రిటన్ పర్యటనకు వెళ్లినట్లుగా సమాచారం. అయితే, లండన్ పోలీసులు ఆయన కారును తనిఖీ చేయడంపై ఎవరూ స్పందించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నఖ్వీ కారును పోలీసులు అడ్డుకొని సోదాలు చేస్తున్నట్లుగా కనిపించింది. పోలీసులు తనిఖీ చేసిన బట్టి తీరును చూస్తే సాధారణ తనిఖీల్లో భాగంగా జరిగినట్లు అనిపించడం లేదు.
The status of the leaders of Pakistan’s military regime on the international stage 😬
During his entry into the British Foreign Office, the vehicle of Pakistan’s Interior Minister Mohsin Naqvi was thoroughly inspected, and the car’s trunk was also searched to ensure that no… pic.twitter.com/Z3CuZNWrlO
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) December 8, 2025
పీసీబీ చైర్మన్ అధికారులను కలిసేందుకు బ్రిటిష్ విదేశాంగ కార్యాలయానికి వచ్చిన సమయంలో కారును ఆపి సోదాలు చేశారు. నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ట్రోఫీ భారత్‌కు నఖ్వీ ట్రోఫీ అందించలేదు. పాకిస్తాన్‌ను ఓడించి భారత్ ఆసియా కప్‌ను నెగ్గింది. కానీ, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ట్రోఫీని నఖ్వీ నుంచి తీసుకునేందుకు నిరాకరించింది. ఆ తర్వాత టీమిండియా ప్లేయర్లు ట్రోఫీ లేకుండానే సంబరాల్లో పాల్గొన్నారు. ట్రోఫీ లేకుండానే జట్టు భారత్‌కు చేరుకుంది. ఆయన ట్రోఫీని పట్టుకొని హోటల్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం, ట్రోఫీ ఏసీసీ కార్యాలయంలో ఉంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల నఖ్వీకి ట్రోఫీని అందజేయాలని ఈ మెయిల్ పంపింది. అయితే, గెలిచిన జట్టుకు తాను మాత్రమే స్వయంగా అందజేస్తానని నఖ్వీ పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తున్నది.