Mohsin Naqvi | ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై మీడియ అడిగిన ప్రశ్నలకు ఏసీసీ, పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పందించేందుకు నిరాకరించారు. గత నెల దుబాయి వేదికగా పాకిస్తాన్‌ను ఓడించి భారత జట్టు ఆసియా కప్ టైటిల్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ తర్వాత సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా నఖ్వీ నుంచి ట్రోఫీ, మెడల్స్ తీసుకునేందుకు నిరాకరించింది. పాక్ మంత్రి అయిన నఖ్వీ విజేతకు ట్రోఫీ, ప్లేయర్స్‌కు మెడల్స్ ఇవ్వకుండా స్టేడియం నుంచి తాను ఉన్న హోటల్‌కు తీసుకుపోయారు. భారత జట్టుకు అధికారికంగా ట్రోఫీని అందించలేదు.
టీమిండియా ట్రోఫీ లేకుండానే విజయోత్సవాలు జరుపుకుంది. సమాచారం మేరకు ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) ఆధీనంలో ఉన్నది. అయితే, ట్రోఫీని ఎప్పుడు.. ఎలా భారత్‌కు అందిస్తారన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే, పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వివాహ రిసెప్షన్‌కు నఖ్వీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ మీడియా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. మీడియా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. మీడియా వేసిన ప్రశ్నలకు స్పందించేలదు. తన కారు వైపుగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. పీసీబీ చైర్మన్‌తో పాటు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది అతని వెంట వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విలేకరి ‘ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్ ఏంటీ?’ అంటూ ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. మీడియా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. సొంత దేశం మీడియా ముందే మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత నవ్వుతూ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, నఖ్వీ తన బాధ్యతను నిర్వర్తించలేదని.. రూల్స్‌ను బ్రేక్ చేశారని.. ప్రోటోకాల్‌ను సైతం ఉల్లంఘించినట్లుగా ఆరోపణలున్నాయి. విజేత భారత జట్టును ట్రోఫీకి దూరంగా ఉంచి.. ఆయన ఏసీసీ చీఫ్ విధులను ఉల్లంఘించినట్లుగా మండిపడుతున్నారు. ఇది క్రికెట్ పరిపాలన ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించింది. ఈ అంశాన్ని ఐసీసీ సమావేశంలో లేవనెత్తనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. బీసీసీఐ సైతం నఖ్వీపై అభిశంసనకు డిమాండ్ చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నఖ్వీ ప్రవర్తన, ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఆసియా క్రికెట్, ఐసీసీ ప్రతిష్టను దెబ్బతీశాని బీసీసీఐ పేర్కొంది.
Chairman PCB & Asian Cricket Council President Moshin Naqvi, faced questions about the ACC trophy controversy during Abrar Ahmed’s valima in Karachi. Here’s his response.#AsiaCup2025 #Karachi #TOKSports pic.twitter.com/788xkFa0ka
— TOK Sports (@TOKSports021) October 6, 2025