Mohammed Siraj | వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి మహ్మద్ సిరాజ్
Mohammed Siraj | టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ సిరాజ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ సిరాజ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన మరో బౌలర్ మిచెల్ స్టార్క్ సిరాజ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.
మిచెల్ స్టార్క్ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి, రెండో వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. మహ్మద్ సిరాజ్ మొదటి వన్డేలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా మంచి ప్రదర్శనే చేసినా.. రెండో వన్డేలో కేవలం మూడు ఓవర్లో 37 పరుగులిచ్చాడు. దాంతో బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు.
విశాఖలో ఆస్ట్రేలియా బ్యాటర్లు మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ వీరవిహారం చేయడం ద్వారా సిరాజ్ బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టారు. అయితే, ఇటీవల అన్ని ఫార్మాట్లలో సిరాజ్ బాగా రాణిస్తున్నాడు. అందుకే ఈ ఏడాది జనవరిలో వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

