హైదరాబాద్: హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj).. ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే మనవరాలితో స్వరం కలిపాడు. ఆ ఇద్దరూ కలిసి ఓ పాట పాడారు. ఆశా భోస్లే మనవరాలు జనై.. తన కొత్త మ్యూజిక్ ఆల్బమ్ నుంచి ఓ పాట పాడారు. కెందీ హై అన్న పాటకు .. సిరాజ్ కూడా స్వరం కలిపాడు. ఇద్దరూ ఓ బెడ్‌పై కూర్చుని .. మ్యూజిక్‌ను ఎంజాయ్ చేశారు. సిరాజ్, జనై పాటలు పాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దానికి క్యాప్షన్ కూడా ఇచ్చింది జనై. యూ సింప్లీ ఆర్ ద బెస్ట్ ఎవర్ అని పేర్కొన్నది.
ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న సిరాజ్.. ఆ ఖాళీ టైంను సద్వినియోగం చేసుకున్నాడు. ముస్లింల పవిత్ర నగరం మక్కాకు వెళ్లాడు. అక్కడ ఉమ్రా నిర్వహించాడు. ఆ తీర్థయాత్రకు చెందిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు సిరాజ్. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను మక్కా టూర్ చేశాడు. ఆ ఫోటకు జనై కూడా రియాక్ట్ అయ్యింది. మూడు గుండె ఎమోజీలను పోస్టు చేసింది.
నిజానికి సిరాజ్, జనై మధ్య రిలేషన్ ఉన్నట్లు తొలుత రూమర్స్ వచ్చాయి. కానీ ఆ ఊహాగానాలకు చెక్ పెట్టింది జనై. సిరాజ్‌తో ఉన్న తన అనుబంధాన్ని చెప్పేసింది. మేరీ ప్యారే భయ్యా అంటూ పేర్కొన్నది. సిరాజ్‌ను సోదరుడిగా చూస్తున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆమె చెప్పింది. జనైను బెహనా అంటూ సిరాజ్ కూడా క్యాప్షన్ ఇచ్చాడు.