Mohammed Siraj | ముంబై : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, ప్రముఖ నటి మహీరా శర్మతో డేటింగ్లో ఉన్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. బిగ్‌బాస్-13తో ఫేమస్ అయిన మహీరాతో సిరాజ్ గత కొద్ది రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. గతేడాది నవంబర్‌లో మహీరా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ చేయడం, ఆ తర్వాత ఒకరినొకరు ఫాలో కావడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది. వీరిద్దరు ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారని, ఇద్దరి మధ్య సంబంధాన్ని రహస్యంగా కొనసాగిస్తున్నారని ఒక ఇంగ్లీష్ వార్తాసంస్థ తమ కథనంలో పేర్కొంది. ఇటీవలే ఆశాభోంస్లే మనువరాలు జైనై భోంస్లేతో సిరాజ్ సన్నిహితంగా మెలిగిన ఫొటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.