కోల్‌కతా: ఫిట్నెస్ లేమితో భారత జట్టులో చోటు కోల్పోయి సెలక్టర్లపై నేరుగా విమర్శలకు దిగుతున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో సత్తాచాటాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ పేసర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టి బెంగాల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఫిట్‌గా లేని కారణంగానే షమీని ఇంగ్లండ్ పర్యటనతో పాటు ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఎంపిక చేయలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించగా షమీ తాజా ప్రదర్శనతో విమర్శకులకు తన ప్రదర్శనతో బదులిచ్చాడు.