గురుగ్రామ్: ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, దేశవాళీ టోర్నీ రంజీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవడం ద్వారా ఆస్ట్రేలియా సిరీస్ సిద్ధమవుతానని భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేర్కొన్నాడు. గాయం కారణంగా గత నవంబర్ నుంచి జట్టుకు దూరమైన షమీ..నెట్స్‌లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. తన సన్నద్ధతపై షమీ మీడియాతో స్పందిస్తూ ‘ఎలాంటి నొప్పి లేకుండా బౌలింగ్ చేయడంపై సంతోషంగా ఉన్నాను.
ఒత్తిడి బాగా పడకుండా హాఫ్ రనప్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ ఆదివాం పూర్తి రనప్‌తో వంద శాతం బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించాను. చాలా మంది ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుతాడా లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సిరీస్ మొదలుకావడానికి చాలా సమయం ఉంది. ఆ లోగా దేశవాళీ ఒకటి, రెండు మ్యాచ్‌లు ఆడటం ద్వారా మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తానన్న నమ్మకముంది’ అని అన్నాడు.