Mohammad Siraj : గత కొంతకాలంగా భారత పేస్ దళానికి కొండంత ఆస్తిలా మారిన మహమ్మద్ సిరాజ్(Mohammad Siraj) టెస్టుల్లో చెలరేగిపోతున్నాడు. లైన్ అండ్ లెంగ్త్‌కు నిలకడను జోడించి ఇంగ్లండ్ బ్యాటర్లను హడలెత్తించిన మియా భాయ్ ఈసారి స్వదేశంలో తన తడాఖా చూపించాడు. ‘ఓవల్ టెస్టు హీరో’గా దిగ్గజాల ప్రశంసలు అందుకున్న సిరాజ్ ఇప్పుడు వెస్టిండీస్ (West Indies) బ్యాటర్ల భరతం పట్టాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో7 వికెట్లతో విండీస్ నడ్డివిరిచాడీ స్పీడ్‌స్టర్. తద్వారా సొంతగడ్డపై సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌లో మొదటిసారి ఐదుకు పైగా వికెట్లు పడగొట్టాడు.
టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన సిరాజ్ భారత పర్యటనను విజయంతో ఆరంభిచాలనుకున్న వెస్టిండీస్‌కు గట్టి షాకిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో విజృంభించిన ఈ హైదరాబాదీ.. రెండో ఇన్నింగ్స్‌లో కరీబియన్ జట్టు పాలిట విలన్ అయ్యాడు. మూడో రోజు ఉదయమే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 448/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టుకు ఆదిలోనే షాకిచ్చాడీ పేస్ గన్. డేంజరస్ ఓపెనర్ తగ్‌నరైన్ చందర్‌పాల్‌ను ఔట్ చేసి బ్రేకిచ్చిన సిరాజ్.. ఆఖర్లో టెయిలెండర్లను వెనక్కి పంపి జట్టు విజయంలో కీలకమయ్యాడు.
Breaking new ground 🌟
Mohd. Siraj with a special performance to help #TeamIndia register a dominant win in the 1st Test🔝#INDvWI | @IDFCFIRSTBank | @mdsirajofficial pic.twitter.com/gkSuFIECQV
— BCCI (@BCCI) October 4, 2025
ఈ మ్యాచ్‌లో 25 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. 7/71తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో 4\40, రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 3/31తో రాణించాడు. నిరుడు ఇంగ్లండ్‌పై రాజ్‌కోట్ టెస్టులో నాలుగు వికెట్ల ప్రదర్శనే సిరాజ్‌కు బెస్ట్‌గా ఉంది. ఆ మ్యాచ్‌లో ఐదో వికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా చివరకు 4/100తో సరిపెట్టుకున్నాడు సిరాజ్. ఇప్పటివరకూ 42 టెస్టులు ఆడిన అతడు.. 130 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛. 👏
Nitish Kumar Reddy grabs a flying stunner 🚀
Mohd. Siraj strikes early for #TeamIndia ☝️
Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/1Bph4oG9en
— BCCI (@BCCI) October 4, 2025
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) సైకిల్ 2025-27లో మొదటిదైన అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో నిప్పులు చెరిగాడు సిరాజ్. అలుపెరగకుండా 185.3 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు.. 32.43 సగటుతో 23 వికెట్లు తీసి ఇంగ్లండ్ సిరీస్ విజయాన్ని అడ్డుకున్నాడు. ఓవల్ టెస్టులో చిరస్మరణీయ ప్రదర్శనతో జట్టును గెలిపించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అంతేకాదు.. తన సంచలన బౌలింగ్ ప్రదర్శనకు బహుమతిగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎగరేసుకుపోయాడీ పేసర్.