Mohammad Siraj | పెండ్లి వేడుకలో ఖవ్వాలీ కచేరీ.. మస్త్ ఎంజాయ్ చేసిన సిరాజ్.. వీడియో
Mohammad Siraj : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు(Team India) చారిత్రాత్మక విజయంలో భాగమైన పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) తీరిక సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు. ఈ స్పీడ్‌స్టర్ తాజాగా హైదరాబాద్‌లో తన స్నేహితుడి పెండ్లి వేడుకలో...
Mohammad Siraj : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు(Team India) చారిత్రాత్మక విజయంలో భాగమైన పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) తీరిక సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు. ఈ స్పీడ్‌స్టర్ తాజాగా హైదరాబాద్‌లో తన స్నేహితుడి పెండ్లి వేడుకలో సందడి చేశాడు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఖవ్వాలీ(Qawwali) కచేరీ వింటూ మస్త్ ఎంజాయ్ చేశాడు.
సిరాజ్ రాకతో సంతోషంలో మునిగిపోయిన స్నేహితులు అతడిపై, ఖవ్వాలీ గాయకుడిపై డబ్బులు విసురుతూ హంగామా చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ మ్యాచ్‌లతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డ హైదరాబాదీ పేసర్ సిరాజ్.. అనతికాలంలోనే భారత జట్టుకులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఆసియా కప్(Asia Cup 2023) ఫైనల్లో శ్రీలంకపై సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలిచిన ఈ స్పీడ్‌స్టర్.. దక్షిణాఫ్రికాతో న్యూలాండ్స్(Newlands)లో జరిగిన రెండో టెస్టులో నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సంచలన బౌలింగ్‌తో 6 వికెట్లు తీసి సఫారీలను చావు దెబ్బ కొట్టాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ ఒక వికెట్ పడగొట్టి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. సఫారీ పర్యటన తర్వాత అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన సిరాజ్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు. అనంతరం ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఈ స్టార్ పేసర్ బరిలోకి దిగనున్నాడు.
ఇవి కూడా చదవండి
- Cocaine | ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టివేత
- Kalki 2898 AD | కల్కి 2898 ఏడీ థియేటర్లకు వచ్చే టైం ఫిక్స్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..!
- Praja Bhavan | ప్రజాభవన్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

