ట్రినిడాడ్ : స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడా (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం)తో విజయం సాధించింది. మొదట పాక్ బ్యాటింగ్ చేసి 37 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది.
పాక్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 40 పరుగుల మార్కును అందుకోలేదు. వర్షం కారణంగా విండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 181గా నిర్దేశించగా ఆ జట్టు 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.