Hockey | భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత హాకీ జట్లకు బుధవారం మిశ్రమ ఫలితాలు దక్కాయి. అబ్బాయిల జట్టు జర్మనీపై గెలిచి మంగళవారం నాటి ఓటమికి బదులు తీర్చుకోగా.. అమ్మాయిలు స్పెయిన్ చేతిలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడారు.
హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 1-0తో జర్మనీని ఓడించింది. గుర్జాంత్ సింగ్ ఆట 4వ నిమిషంలోనే గోల్ కొట్టాడు. అమ్మాయిలు 0-1తో స్పెయిన్ చేతిలో ఓడారు.