MIW vs RCBW : డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరే విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నడినే డీక్లెర్క్(63 నాటౌట్) సిక్సర్ల మోతతో ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు. 65కే సగం వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని ఆదుకున్న ఈ సఫారీ చిచ్చరపిడుగు.. ఆఖరి ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. దాంతో.. ఓటమి ఖాయమనుకున్న మంధాన సేన అనూహ్యంగా 3 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
భారీ ఛేదనను దూకుడుగా ఆరంభించిన ఆర్సీబీకి షబ్నం ఇస్లాయిల్ షాకిచ్చింది. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(18)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించింది. కాసేపటికే నాట్ సీవర్ బ్రంట్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన గ్రేస్ హ్యారిస్(25) బౌండరీ లైన్ వద్ద షబ్నం చేతికి చిక్కింది. దాంతో.. 45కే ఓపెనర్లు డగౌట్ చేరారు. ఆ తర్వాత 9 పరుగుల వ్యవధిలోనే ఆర్సీబీ బ్యాటర్లు రీచా ఘోష్(6), దయలాన్ హేమలత(7), రాధా యాదవ్(1) ఔటయ్యారు. కీలక బ్యాటర్లు డగౌట్ చేరడంతో ఒత్తిడిలో కూరుకుపోయిన బెంగళూరును గెలుపు దిశగా నడిపించింది నడినే డీక్లెర్క్(63 నాటౌట్), అరుంధతి రెడ్డి(20 )తో కలిసి ఆరో వికెట్‌కు 50 రన్స్ జోడించింది. దాంతో.. ఆర్సీబీ 16 ఓవర్లకు 117 పరుగులు చేసింది.
A #TATAWPL classic in the season opener! 🔥
And we have just begun 😎
What a finish that from Nadine de Klerk! 🤯
Scorecard ▶️ https://t.co/IWU1URl1fr#KhelEmotionKa | #MIvRCB pic.twitter.com/FKyZhLwbto
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
నాట్ సీవర్ బ్రంట్ వేసిన 20వ ఓవర్లో తొలి రెండు బంతులకు ఒక్క రన్ రాలేదు. మూడో బంతిని డీక్లెర్క్ సిక్సర్‌గా మలిచింది, నాలుగో బంతిని ఫైన్ లెగ్‌లో బౌండరీకి పంపింది. ఐదో బంతిని స్టాండ్స్‌లోకి పంపిన ఫినిషర్ మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పింది. చివరి బంతికి రెండు రన్స్ అవసరం కాగా బౌండరీతో బెంగళూరును 3 వికెట్ల తేడాతో గెలిపించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ కొట్టింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ బ్యాటర్లు సంజీవన సంజన(45) నికోల క్యారీ(40)లు దంచేశారు. వీరిద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఉతికేస్తూ డెత్ ఓవర్లలో బౌండరీల మోత మోగించారు. దాంతో.. ఒక దశలో 120 దాటడమే గగనం అనుకున్న ముంబై అనూహ్యంగా 154 పరుగులు చేయగలిగింది.