Jitendra Singh | బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎల్ ఆటగాడు, మాజీ జమ్మూ కశ్మీర్ క్రికెటర్ మిథున్ మన్హాస్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభినందనలు తెలిపారు. రోజర్ బిన్నీ గత నెలలో బీసీసీఐ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్పందిస్తూ.. జమ్ము కశ్మీర్ నుంచి ఓ ఆటగాడు ఈ పదవికి ఎన్నికవడం ఇదే తొలిసారని.. ఓ చారిత్రాత్మక క్షణాలని పేర్కొన్నారు. మిథున్ మన్హాస్‌ను బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారని.. ఇది జమ్ము కశ్మీర్లో మారుమూల జిల్లాల్లో ఒకటైన దోడాకు ఎంతటి కీలకమైన విజయమో వర్ణించడం కష్టమన్నారు. ఈ జిల్లా కూడా తనకు జన్మస్థలమన్నారు. కొన్ని గంటల వ్యవధిలో రెండు కీలక వార్తలు వచ్చాయని.. తొలుత శీతల్ దేవి ప్రపంచ పారా ఆర్చర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిందని.. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ ఎంపికయ్యారంటూ హర్షం వ్యక్తం చేశారు.
45 సంవత్సరాల మిథున్ మన్హాస్ చాలా సంవత్సరాల క్రికెట్ ఆడాడు. దేశీయ క్రికెట్లో ఢిల్లీ జట్టు తరఫున క్రికెట్ ఆడాడు. 157 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 130 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 91 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మిథున్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లో 9714 పరుగులు చేశాడు. కానీ, భారత జట్టు తరఫున ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. ఐపీఎల్లో మూడు ఫ్రాంచైజీలకు ఆడాడు. ఢిల్లీ డేర్ డేవిల్స్, పుణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మ్యాచులు ఆడాడు. ఇటీవల జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA)లో పని చేశాడు. గతంలో దులీప్ ట్రోఫీకి నార్త్ జోన్ కన్వీనర్‌గా పనిచేశాడు. ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టు సహాయక సిబ్బందిలో భాగమయ్యాడు.
తాజాగా రోజర్ బిన్నీ స్థానంలో మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ ఆఫీస్ బేరర్‌కు గరిష్ట వయోపరిమితిని 70 సంవత్సరాలుగా నిర్ణయించిన నేపథ్యంలో బిన్నీ పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అయితే, బీసీసీఐ అధ్యక్షుడి రేసులో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, రఘురామ్ భట్ పేర్లు సైతం వినిపించాయి. అయితే, చివరికి మన్హాస్‌కు అవకాశం దక్కింది. కొత్త కమిటీని బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) కొత్త అధ్యక్షుడిని నిర్ణయించారు. ఏజీఎంలో మహిళా సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా అమిత శర్మ పేరును ఖరారు చేశారు. ఆమె నీతు డేవిడ్ స్థానంలో బాధ్యతలు చేపడుతారు. 116 వన్డేలు ఆడిన భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అమిత శర్మతో పాటు శ్యామా డే, జయ శర్మ, స్రవంతి నాయుడు ప్యానెల్లో సభ్యులుగా ఉంటారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారతదేశం, శ్రీలంకలో జరగనున్న మహిళల ప్రపంచ కప్ తర్వాత పదవీకాలం మొదలవనున్నది.
A momentous occasion to celebrate!
Mithun Manhas has been officially declared as the new President of the ‘Board of Control for Cricket in India’ #BCCI.
What a providential Sunday for the erstwhile district of Doda, one of the remotest parts of Jammu & Kashmir, which incidentally… pic.twitter.com/I6PpEMtH2T— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 28, 2025