IPL 2024 Mini Auction : ఇండియన్ ప్రీమియర్ 17వ సీజన్ మినీ వేలంలో ఆస్టేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) సంచలనం సృష్టించాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. రూ.24.75 కోట్లతో తన సహచరుడు ప్యాట్ కమిన్స్(రూ.20.5 కోట్లు) రికార్డును బద్ధలు కొట్టాడు. రూ. 2 కోట్ల కనీస ధర ఉన్న ఈ యార్కర్ కింగ్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), గుజరాత్ టైటాన్స్ నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డాయి. కానీ, చివరకు కోల్‌కతా భారీ ధరకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్(Daryl Mitchell) రూ.14 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
1. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – రూ.24.75 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్
2. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) – రూ.20.5 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
3. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – రూ. 14 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
4. హర్షల్ పటేల్(భారత్) – రూ.11.75 కోట్లు – పంజాబ్ కింగ్స్
5. అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్) – రూ. 11. 50 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
WOWZAAA 💰
Chennai Super Kings get New Zealand allrounder Daryl Mitchell for an enormous price of INR 14 Crore! 💛#IPLAuction | #IPL pic.twitter.com/1j0vfuwRRU
— IndianPremierLeague (@IPL) December 19, 2023
6. రొవ్మన్ పావెల్(వెస్టిండీస్) – రూ. 7.4 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
7. ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) – రూ. 6.80 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్
8. ఉమేశ్ యాదవ్(భారత్) – రూ. 5.8 కోట్లు గుజరాత్ టైటాన్స్
9. గెరాల్డ్ కోయెట్జీ (దక్షిణాఫ్రికా) – రూ. 5 కోట్లు – ముంబై ఇండియన్స్
రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, గెరాల్డ్ కోయెట్జీ
10. క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్) – రూ.4.2 కోట్లు – పంజాబ్ కింగ్స్
11. శార్థూల్ ఠాకూర్ (భారత్) రూ. 4 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్
12. హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్) – రూ 4 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
13. రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్) రూ.1.8 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్