IND vs NZ : నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్లు దంచేశారు. భారీ స్కోర్ చేసింది. 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలనుకున్న భారత బౌలర్ల వ్యూహాలను తిప్పికొడుతూ డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్ (106) కొండంత స్కోర్ అందించారు. క్రీజులో కుదురుకున్న ఈ ద్వయం మిడిల్ ఓవర్లలో ఎడాపెడా ఫోర్లు, చెలరేగి స్కోర్ బోర్డును ఉరికించింది. సెంచరీ తర్వాత ఇద్దరూ ఔట్ కావడంతో స్కోర్ వేగం తక్కింది. ఆఖర్లో కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్(28 నాటౌట్) ధనాధన్ ఆటతో స్కోర్ 330 దాటించాడు. దాంతో, టీమిండియాకు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆరంభంలో తడబడినా.. ఆ తర్వాత గొప్పగా పుంజుకంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్ సూపర్ డెలివరీతో ఓపెనర్ హెన్రీ నికోల్స్(0)ను బౌల్డ్ చేశాడు. ఫామ్‌లోలేని డెవాన్ కాన్వే(5)ను మళ్లీ హర్షిత్ రానానే పెలిలియన్ పంపాడు. 5 పరుగులకే రెండు వికెట్లు పడిన వేళ.. ‘నేనున్నాగా’ అంటూ డారిల్ మిచెల్(137) ఆపద్భాదంవుడి పాత్ర పోషించాడు.
Centuries for Glenn Phillips and Daryl Mitchell take the team to 337/8 at the innings break 💪
Watch all the action live in NZ on Sky Sport.#INDvNZ | 📸 BCCI pic.twitter.com/98GLVRXpdu
— BLACKCAPS (@BLACKCAPS) January 18, 2026
విల్ యంగ్(30)తో కలిసి పవర్ ప్లేలో మరో వికెట్ పడకుండా ఆడిన అతడు.. ఆ తర్వాత గ్లెన్ ఫిలిఫ్స్(106)తో తన స్టయిల్ విధ్వంసంతో భారత బౌలర్లను భయపెట్టాడు. అతడిని బోల్తా కొట్టించాలని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మిడిల్ ఓవర్లలో పేసర్లతో బౌలింగ్ చేయించినా పరుగులు రాబట్టాడు. నాలుగో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడీ చిచ్చరపిడుగు. పవర్ హిట్టింగ్తో అలరించిన ఫిలిప్స్ 83 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వన్డేల్లో అతడికిది రెండో వంద.
కాసేపటికే అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో అతడు కీపర్ రాహుల్ చేతికి చిక్కాడు. అనంతరం సిరాజ్ ఓవర్లో కుల్దీప్ చేతికి మిచెల్ కూడా దొరకగా.. భారత బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు. ఆఖర్లో కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్(28 నాటౌట్), క్రిస్టన్ క్లార్కే()లు దూకుడుగా ఆడడంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 338 రన్స్ చేసింది.