IND vs NZ : మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. వడోదరలో కివీస్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్(62), డెవాన్ కాన్వే(56)లు అర్ధ శతకాలతో శుభారంభవ్వగా.. ప్రత్యర్థి మూడొందలకు పైగా కొడుతుందనిపించింది. కానీ, ను ఔట్ హర్షిత్ రానా(2-65).. ప్రసిధ్ కృష్ణ(2-60) పొదుపుగా వికెట్ల వేటతో మిడిలార్డర్ తోకముడిచింది. ఓవైపు వికెట్లు పడుతున్న డారిల్ మిచెల్ (84) ఒంటరి సైనికుడిలా పోరాడాడు. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చిన అతడిని ప్రసిధ్ వెనక్కి పంపడంతో న్యూజిలాండ్ పరిమితమైంది.
వడోదరలో న్యూజిలాండ్ బ్యాటర్లు సమిష్టిగా రాణించి పోరాడగలిగే స్కోర్ అందించారు. టాస్ ఓడిన జట్టుకు ఓపెనర్లు హెన్రీ నికోల్స్(62), డెవాన్ కాన్వే(56)లు శుభారంభమిచ్చారు. భారత పేస్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొన్న వీరిద్దరూ నింపాదిగా ఆడుతూ స్కోర్ బోర్డును ఉరికించారు. క్రీజులో పాతుకుపోవడంతో 21 ఓవర్ల వరకూ ఒక్క వికెట్ పడలేదు. అయితే.. అర్ధ శతకంతో రెచ్చిపోయిన నికోల్స్‌ను ఔట్ చేసి హర్షిత్ రానా (2-65) పరుగులకు బ్రేకులు వేశాడు. ఆ తర్వాత కాసేపటికే హాఫ్ సెంచరీతో జోరు మీదున్న కాన్వేను రానా ఊహించని బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అక్కడి నుంచి న్యూజిలాండ్ స్కోర్ వేగం తగ్గింది.
Innings Break!
New Zealand post 3⃣0⃣0⃣/8 in the first innings
Over to our batters 🙌
Updates ▶️ https://t.co/OcIPHEpvjr#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/12Mb0kqBZ7
— BCCI (@BCCI) January 11, 2026
ఓపెనర్లు వెంట వెంటనే ఔట్ కావడంతో.. న్యూజిలాండ్ మిడిలార్డర్ కూడా క్రీజులో నిలువలేదు. సిరాజ్ ఓవర్లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి విల్ యంగ్(12) వెనుదిరిగాడు. డేంజరస్ గ్లెన్ ఫిలిఫ్స్(12)ను కుల్దీప్ యాదవ్ బుట్టలో వేసుకోగా.. శ్రేయాస్ అయ్యర్ మెరుపు త్రోకు కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్(16) రనౌటయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్న డారిల్ మిచెల్(84 71 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లు) మాత్రం తడబడలేదు. హాఫ్ సెంచరీ తర్వాత రెచ్చిపోయిన అతడు.. ప్రసిధ్ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదిన మిచెల్ ఆ తర్వాత ఔటయ్యాడు. ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లతో కలిపి 14 రన్స్ రావడంతో న్యూజిలాండ్ మూడొందలకు పరిమితమైంది.
LBW!
Number 2⃣ for Prasidh Krishna!
Daryl Mitchell departs for 84
Updates ▶️ https://t.co/OcIPHEpvjr#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/FdpGuUKMpQ
— BCCI (@BCCI) January 11, 2026