ఇంఫాల్: టోక్యో ఒలింపిక్స్ తొలి రోజే ఇండియాకు సిల్వర్ మెడల్ అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను( Mirabai Chanu ).. ఆదివారం తన 27వ పుట్టినరోజు జరుకుంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్తో కలిసి ఆమె కేక్ కట్ చేయడం విశేషం. సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన ఆమెకు ప్రత్యేకంగా కేక్ ఏర్పాటు చేశారు. ఈ కేక్ కటింగ్ వీడియోను బీరేన్ సింగ్ ట్విటర్లో షేర్ చేశారు. తన 27వ పుట్టిన రోజునాడు మీరాబాయి చాను మా అధికారిక నివాసానికి రావడం సంతోషంగా ఉంది. మీరాబాయి, హ్యాపీ బర్త్ డే. దేశానికి ఇలాగే గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను అని బీరేన్ సింగ్ ట్వీట్ చేశారు. తన బర్త్ డేను ఎంతో స్పెషల్గా మార్చిన ముఖ్యమంత్రికి మీరాబాయి కృతజ్ఞతలు తెలిపింది.
It was a pleasure having @mirabai_chanu at my official residence on her 27th Birthday.
— N.Biren Singh (@NBirenSingh) August 8, 2021
Wishing you a very happy birthday Mirabai. May you continue to bring laurels to the country.@narendramodi @ianuragthakur pic.twitter.com/Tc1SYL4KU8