న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభవేడుకల్లో భారత పతాకధారులుగా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ వ్యవహరిస్తారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) శనివారం ప్రకటించింది.
గ్లాస్గో వేదికగా ఈనెల 23న జరిగే ప్రారంభోత్సవంలో భారత బృందాన్ని ఒలింపిక్ పతక విజేతలైన చాను, లవ్లీనా ముందుండి నడిపిస్తారని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపింది. క్రీడల్లో పాల్గొనే భారత జట్టు మొత్తానికి ఆమె శుభాకాంక్షలు తెలియజేసింది.