బన్సీలాల్‌పేట్/బొల్లారం: జాతీయస్థాయి కుంగ్‌ఫూ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన గురుశిష్యులు షేక్ కలీం, సాయికుమార్ సత్తాచాటారు. ఫలక్‌నుమాలోని మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 11వ జాతీయస్థాయి కుంగ్‌ఫూ, కరాటే టోర్నీలో మాస్టర్స్ లెవల్ కటాస్ విభాగంలో షేక్ కలీం పసిడి పతకంతో మెరువగా, స్పారింగ్, వెపన్ విభాగాల్లో సాయికుమార్ రెండు స్వర్ణ పతకాలు దక్కించుకున్నాడు.
అయితే కొన్నేళ్లుగా సాయికుమార్‌కు కలీం..కుంగ్‌ఫూలో శిక్షణ ఇస్తున్నాడు. సోమవారం వీరిద్దరి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన నివాసంలో అభినందించారు. రాష్ట్ర ఖ్యాతిని పెంచుతున్న ప్లేయర్లను ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు.