శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 20, 2020 , 23:26:58

కబడ్డీకి ఆదరణ భేష్‌

 కబడ్డీకి ఆదరణ భేష్‌
  • టీపీకేఎల్‌ ట్రోఫీని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: గ్రామీణ క్రీడ కబడ్డీకి అభిమానుల్లో ఆదరణ బాగుందని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌(టీపీకేఎల్‌) సీజన్‌-3 ట్రోఫీని గురువారం తన చాంబర్‌లో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీపీకేఎల్‌లో బరిలోకి దిగుతున్న జట్లకు శుభాకాంక్షలు. ప్రతిభ కల్గిన గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి లీగ్‌ నిర్వహించడం అభినందనీయం. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహనికి ఎంతో కృషి చేస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి క్రీడాకారులు రాష్ర్టానికి మరింత వన్నె తీసుకురావాలి. టీపీకేఎల్‌కు రాష్ట్ర క్రీడాశాఖ తరఫున అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీకేఎల్‌ కన్వీనర్‌ సంజయ్‌ రెడ్డి, రంగారెడ్డి జట్టు యజమాని  శ్రీనివాస్‌ రెడ్డి, గణేశ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo