హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మంత్రి కేటీఆర్ మరోసారి తన హాస్య చతురతను ప్రదర్శించారు. కొందరు క్రొయేషియా ఆటగాళ్ల పేర్లు విచిత్రంగా ఉండటంపై ఆయన శుక్రవారం ఫన్నీ ట్వీట్ చేశారు. ‘నేను క్రొయేషియన్ల మూలాలను వెతుకుతున్నాను. ఎందుకో తెలుసా. కొందరు క్రొయేషియన్ ఆటగాళ్లకు హైదరాబాద్‌తో సంబంధం ఉన్నట్టు అర్థం అవుతున్నది. దీనికోసం పెద్దగా పరిశోధించాల్సిన అవసరం లేదు. వారి పేర్లను పరిశీలిస్తే చాలు.
ఇనోవిచ్, యూనోవిచ్, ఇదరీచ్, ఉదరీచ్, ఐసీచ్, వైసీచ్…’ అంటూ క్రొయేషియన్ ఆటగాళ్ల పేర్లు పక్కా హైదరాబాదీ పదాలను పోలి ఉన్నాయంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.