హైదరాబాద్ : నాలుగు నెలల పాటు ఆసక్తికరంగా కొనసాగిన ఇండియన్ సూపర్ లీగ్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) చాంపియన్‌గా అవతరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఐఎస్ఎల్ లీగ్‌లో ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్ టైటిల్ విజేతగా నిలిచింది. తుది పోరులో నిలిచిన తొలిసారే కప్‌ను ముద్దాడి కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం ఆద్యంతంఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో హెచ్ఎఫ్సీ కేరళ బ్లాస్టర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. అభిమానులు ఊపిరి బిగపట్టుకుని మునివేళ్లపై మ్యాచ్‌ను వీక్షించిన వేళ.. హలీచరణ్ గోల్‌తో హైదరాబాద్ గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. మొత్తంగా దేశ ఫుట్‌బాల్ యవనికపై హైదరాబాద్ పేరు మరోమారు మార్మోగింది.
Congratulations @HydFCOfficial on becoming the champions 👏👏
Well deserved and long awaited. Onwards & upwards 👍 https://t.co/ZaBHzJztkB
— KTR (@KTRTRS) March 20, 2022