సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దేశంలో తొలిసారి హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు సంబంధించి ముంబైలో జరిగే భేటీకి మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. ఈ నెల 17న గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద జరిగే సమావేశంలో రేసింగ్ పోటీలు, దాని ప్రాముఖ్యత లాంటి అంశాలపై కేటీఆర్ మాట్లాడుతారు. ఈ భేటీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌షిండే పాల్గొననున్నారు.
హైదరాబాద్‌లో ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ రేసింగ్ జరుగనున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకోనుంది. ఫార్ములా రేసింగ్ కోసం ఇప్పటికే ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయం మొదలైంది. అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుందని బుక్ మై షో నిర్వాహకులు పేర్కొన్నారు.