వెల్లింగ్టన్: స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు గాను న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖెల్ బ్రాస్‌వెల్ ఆ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కివీస్ స్టార్ ప్లేయర్లు, ఆ జట్టు నాయకుడు మిచెల్ శాంట్నర్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర, బెవాన్ జాకబ్స్ ఐపీఎల్-18కు తమ ఫ్రాంచైజీలకు ఆడనున్న నేపథ్యంలో బ్రాస్‌వెల్ కివీస్‌ను నడిపించనున్నాడు.
న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య ఈనెల 16 నుంచి 26 దాకా ఐదు టీ20లు జరుగనున్నాయి. పాక్ జట్టు యువ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా నేతృత్వంలో బరిలోకి దిగనుంది.