MI vs RCB : ముంబై ఇండియన్స్ ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ హాఫ్ సెంచరీ బాదింది. పవర్ హిట్టింగ్తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకు పడిన ఆమె 26 బంతుల్లో ఫీఫ్టీ రన్స్ చేసింది. నాట్ సీవర్ బ్రంట్(27)తో కలిసి రెండో వికెట్‌కు 65 రన్స్ జోడించింది. 11 ఓవర్లకు ముంబై స్కోర్.. 110/1. ఆ జట్టు విజయానికి 54 బంతుల్లో 46 రన్స్ కావాలి. తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, అమేలియా కేరీ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది.
మోస్తరు టార్గెట్ 156తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 45 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. ఓపెనర్ యస్తికా భాటియా (23) వికెట్ కోల్పోయింది. ప్రీతి బోస్ వేసిన ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఆమె ఎల్బీగా వెనుదిరిగింది. మరో ఓపెనర్ హేలీ కలిసి యస్తిక బౌండరీలు కొడుతూ స్కోర్‌బోర్డు పరుగులు పెట్టించింది. వీళ్లు గ్యాప్స్‌లో ఫోర్లు కొడుతూ చెలరేగారు.