Buchin Babu Tournament : ఐపీఎల్ 18వ సీజన్లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన ఆయుష్ మాత్రే (Ayush Mhatre) భావి కెప్టెన్‌గా ఎదుగుతున్నాడు. ఈమధ్యే ఇంగ్లండ్ పర్యటనలో అండర్ -19 జట్టును నడిపించిన ఈ యంగ్‌స్టర్.. ఆస్ట్రేలియా పర్యటనకూ సారథిగా ఎంపికయ్యాడు. ఈసారి ఈ చిచ్చరపిడుగు ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న బుచ్చిబాబు టోర్నమెంట్ (Buchin Babu Tournament) కోసం సెలెక్టర్లు ముంబై సారథిగా ప్రకటించారు.
తమిళనాడు క్రికెట్ సంఘం (TNCA) బుచ్చిబాబు టోర్నీని నిర్వహించనుంది. ఈ మల్టీ డే ఈవెంట్ ఆగస్టు 18న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న జరిగే టైటిల్ పోరుతో టోర్నీ ముగియనుంది. సో.. ఈ టోర్నీలో కప్ కొట్టడమే లక్ష్యంగా మంగళవారం ముంబై సెలెక్టర్లు 18 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు.
The Mumbai Cricket Association (MCA) announced its 17-member squad for the upcoming All India Buchi Babu invitational tournament 🏏#BuchiBabu #Mumbai #AyushMhatre #SarfarazKhan #CricketTwitter pic.twitter.com/8Luhs5sK76
— InsideSport (@InsideSportIND) August 12, 2025
స్క్వాడ్‌లో సర్ఫరాజ్ ఖాన్, సువెద్ పర్కార్ వంటి సీనియర్లు ఉన్నా కూడా.. సెలెక్టర్లు మాత్రేకే ఓటేశారు. ఓపెనర్‌గా రాణిస్తూ తెలివైన నిర్ణయాలతో జట్టును గెలిపించగల సమర్ధుడైన అతడికి జట్టు పగ్గాలు అప్పగించారు. సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ ఉండగా.. వికెట్ కీపర్లుగా ఆకాశ్ ఆనంద్, హార్దిక్ తొమ్రేలు ఎంపికయ్యారు.
ముంబై స్క్వాడ్ : ఆయుష్ మాత్రే (కెప్టెన్), ముషీర్ ఖాన్, దివ్యాన్ష్ సక్సేనా, సర్ఫరాజ్ ఖాన్, సువెద్ పార్కర్(వైస్ కెప్టెన్), ప్రగ్నేశ్ కన్పిల్లెవర్, హర్ష్ అగ్నవ్, సాయిరాజ్ పాటిల్, అకాశ్ పర్కార్, ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్ధిక్ తోమ్రే(వికెట్ కీపర్), శ్రేయాస్ గురవ్, యశ్ డిచోల్కర్, హిమాన్షు సింగ్, రాయ్స్టన్ డియాస్, సిల్వెస్టర్ డిసౌజా, ఇర్ఫాన్ ఉమైర్.