 
                                                            Unofficial 1st Test : అనధికారిక తొలి టెస్టులో భారత ఏ జట్టు పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఏ జట్టును ఆలౌట్ చేసిన బ్యాటింగ్‌లో తేలిపోయింది. స్టార్ ఆటగాళ్లు విఫలమవ్వగా ఓపెనర్ ఆయుశ్ మాత్రే(65) అర్ధ శతకంతో మెరవగా.. ఆయుష్ బదొని(38) పర్వాలేదనిపించాడు. కానీ, స్పిన్నర్ సుబ్రయెన్(5-61) ఐదు వికెట్లతో చెలరేగడంతో 234కే భారత జట్టు ఆలౌటయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పర్యాటక టీమ్ రెండో రోజు ఆట ముగిసే సరికి వంద పరుగుల ఆధిక్యం సాధించింది.
సొంతగడ్డపై చెలరేగి ఆడాలనుకున్న భారత ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(32), ఆయుశ్ మాత్రే(65)లు శుభారంభం ఇచ్చినా మిగతావాళ్లు స్వదినియోగం చేసుకోలేకపోయారు. పేసర్లను దీటగా ఎదుర్కొన్న ఓపెనర్లు తొలి వికెట్‌కు 91 రన్స్ జోడించారు. కానీ, సఫారీ స్పిన్నర్ సుబ్రయేన్(5-61) కీలక వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. గాయం నుంచి కోలుకొని కెప్టెన్‌గా ఆడుతున్న రిషభ్ పంత్(17) స్వల్ప స్కోర్‌కే సెలే ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఆయుశ్ బదొని(38).. తనుష్ కొతియాన్(13)లు కుదురుకున్నా పెద్ద స్కోర్ చేయలేకపోయారు.
Ayush Mhatre brings up his maiden fifty on debut for the India A senior team with a boundary💥🇮🇳
Pure class from the 18-year-old, what a way to announce himself on the big stage 🌟👏
📸: JioHotstar pic.twitter.com/Ytl9j5jiLj
— CricTracker (@Cricketracker) October 31, 2025
మిడిలార్డర్‌ను పెవిలియన్ చేర్చిన సుబ్రయేన్ చివరి బ్యాటర్ ఖలీల్ అహ్మద్‌ను ఔట్ చేయగా 234కే టీమిండియా ఆలౌటయ్యింది. దాంతో.. సఫారీలకు 75 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం ఓపెనర్లు జోర్డాన్ హెర్మాన్(12 నాటౌట్), లెసెగో సెనొక్వానే( 9 నాటౌట్)లు వికెట్ పడకుండా ఆడి రోజును ముగించారు. ఆట ముగిసే సరికి 30 రన్స్ చేసిన దక్షిణాఫ్రికా.. ఆధిక్యాన్ని 105కు పెంచుకుంది. మూడో రోజు రిషభ్ పంత్ సేన వైపు మ్యాచ్ మలుపు తిరగాలంటే బౌలర్లు శ్రమించాల్సిందే. తనుష్ కొతియాన్(4-83), గుర్నూర్ బ్రార్(2-45)ల విజృంభణతో సఫారీ టీమ్ 309కి ఆలౌటైన విషయం తెలిసిందే.
 
                            