Lionel Messi : ఫుట్‌బాల్ ఆటలో అతిపెద్ద పండుగైన ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి సమయం దగ్గరపడుతోంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ మెగా టోర్నీ ప్రారంభా కానుంది. సాకర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్‌లో.. లియోనల్ మెస్సీ (Lionel Messi) ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. వయసురీత్యా అతడు ఆడకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే..ఇప్పటికీ మైదానంలో చురుకుగా కదులుతూ.. గోల్స్‌తో మరిపిస్తున్న ఈ ఫార్వర్డ్ ప్లేయర్ ఫ్యాన్స్‌కు తీపికబురు చెప్పాడు. ఈ మెగా టోర్నీకి తాను మాత్రం సిద్ధంగానే ఉన్నానని అంటున్నాడీ వెటరన్.
అర్జెంటీనా జట్టు 2026 వరల్డ్ కప్ పోటీలకు క్వాలిఫై అయినప్పటి నుంచి మెస్సీ గురించే చర్చ నడుస్తోంది. రెండుసార్లు జట్టును ఫైనల్ చేర్చి.. గత సీజన్లో ట్రోఫీ అందించిన అతడు మరో వరల్డ్ కప్ ఆడాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఈ నేపథ్యంతో మెస్సీ కూడా ఔను.. నాకూ ఆడాలని ఉంది అని అభిమానులను సంబురాల్లో ముంచెత్తాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వరల్డ్ కప్‌లో ఆడడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను. నా పరిస్థితిని రోజు రోజుకు గమనిస్తూ.. అందుబాటులో ఉంటానో లేనో చెబుతాను. ఇప్పటికైతే మెగా టోర్నీ కసం వంద శాతం సిద్దంగా ఉండేందుకు, అర్జెంటీనాకు ఉపయోగపడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే.. ప్రపంచకప్‌లో ఆడడం అసాధారణమైన విషయం. నేను మెగా టోర్నీని ఎంతగానో ఇష్టపడుతాను’ అని మెస్సీ వెల్లడించాడు.
“Ojalá que Dios me permita volver a jugar el Mundial”.
Lionel Messi. 🇦🇷🙏🏽 pic.twitter.com/CzXqxZpZUi
— Team Leo Messi (@TeamLeoM) October 28, 2025
మూడేళ్ల క్రితం ఖతార్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో మెస్సీ అదరగొట్టాడు. తన మార్క్ కెప్టెన్సీతో రెండోసారి అర్జెంటీనాను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. లూసెయిల్ స్టేడియంలో ఫ్రాన్స్(France)తో హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో మెస్సీ రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, 36 ఏళ్ల తర్వాత మళ్లీ అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ క్షణంతో 35 ఏండ్ల మెస్సీ వరల్డ్ కప్ కల కూడా నెరవేరింది.
Lionel Messi proves he can score any type of goal with this brace 🐐 pic.twitter.com/ikTodZhObm
— GOAL (@goal) October 27, 2025
మెగా టోర్నీ అనంతరం పారిస్ సెయింట్ జర్మనీ(PSG)ని వీడిన మెస్సీ అమెరికాకు చెందిన ‘ఇంటర్ మియామి’ (Inter Miami) క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ రెండేళ్లలో గొప్పగా ఆడి తమ క్లబ్‌కు విలువైన ఆస్తిగా మారిన మెస్సీని 2028 వరకూ కొనసాగించాలని ఇంటర్ మియామా యాజమాన్యం నిర్ణయించుకుంది. అందుకు.. ఈ లెజెండరీ ప్లేయర్ కూడా ఓ కచ్చితంగా అని అంగీకరించాడు.