హైదరాబాద్, ఆట ప్రతినిధి: వచ్చే నెలలో జరుగనున్న మిస్టర్ తెలంగాణ పోటీలు విజయవంతం కావాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. షఫీ బాడీబిల్డింగ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మెన్స్ ఫిజిక్ చాంపియన్‌షిప్-2022’కు సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో షఫీ, సమీ, అల్హజారీ, అబ్దుల్లా, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.