బిష్కెక్ (కిర్గిస్థాన్): సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో మీనాక్షి గోయత్ రజతం సాధించింది. మహిళల 53 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన ఆమె.. తుదిపోరులో 0-10తో చైనా రెజ్లర్ ఝాంగ్ జిన్ చేతిలో ఓడింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు ఇది రెండో పతకం.
మోనికా శెరోన్ (65 కి.) 9-0తో హన్బిట్ లీ (దక్షిణ కొరియా)ను ఓడించి కాంస్యం నెగ్గింది. 21 ఏండ్ల హర్షిత (72 కి.) కూడా పొల్వొనొవ (తుర్కెమినిస్థాన్)పై గెలిచి కాంస్యం సొంతం చేసుకుంది. దీంతో మహిళల ఫ్రీస్టయిల్ క్యాటగిరీలో భారత్ నాలుగు కాంస్యాలు, ఒక రజతం సాధించినైట్టెంది.