Jai Shah : భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక సమావేశం ఆదివారం జరుగునుంది. కొత్త సభ్యుల ఎన్నిక ఉత్కంఠ రేపుతున్న వేళ ఈ మీటింగ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ సంఘం (MCA) శనివారం ఐసీసీ అధ్యక్షుడు జై షా(Jai Shah )ను సన్మానించింది. అంతర్జాతీయంగా క్రికెట్ వ్యాప్తికి ఎనలేని కృషి చేస్తున్న షాను అభినందించారు. ముంబైలో డిన్నర్ అనంతరం ఈ కార్యక్రమం జరిగింది.
‘గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ క్రికెట్ వ్యాప్తికి జై షా చేస్తున్న కృషి, అంకితభావం ప్రశంసనీయం. మహిళా క్రికెట్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. మరో మూడు రోజుల్లో భారత గడ్డపై మహిళల వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభివృద్ధికి షా చేస్తున్న సేవల్ని అభినందిస్తూ.. భవిష్యత్‌లో ఆయన ఆటలో మరిన్ని అవసరమైన మార్పులకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నా’ అని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ (Ajinkya Naik) వెల్లడించాడు. బీసీసీఐ సెక్రటరీగా పనిచేసిన షా నిరుడు డిసెంబర్ 1న ఏకగ్రీవంగా ఐసీసీ చీఫ్‌గా ఎంపికయ్యాడు.
The Mumbai Cricket Association (MCA) on Saturday felicitated Jay Shah, Chairman of International Cricket Council (ICC), for his exemplary contribution towards the growth and global reach of cricket. The felicitation was held at a gala dinner hosted by the MCA, attended by pic.twitter.com/06WLaCT4Vv
— Gaurav Gupta (@toi_gauravG) September 27, 2025