క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమలో పడడం, వాళ్లతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. గత కొన్నిరోజులుగా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, బాలీవుడ్ నటి సారా ఆలీ ఖాన్‌తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వినిస్తున్నాయి. ఈమధ్యే సోనమ్ బజ్వా హోస్ట్ చేస్తున్న దిల్ దియన్ గల్లాన్ అనే పంజాబీ టాక్‌షోలో శుభ్‌మన్ గిల్ పాల్గొన్నాడు. ‘సారా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నారా?’ అని సోనమ్ అడిగిన ప్రశ్నకు ‘కావొచ్చు’ అని సమాధానం చెప్పాడు. నిజం చెప్పు అని మళ్లీ అడగడంతో.. ‘నేను నిజమే చెప్తున్నాను. కావొచ్చు.. కాకపోవచ్చు’ అని శుభ్‌మన్ తెలివిగా సమాధానం దాటవేశాడు. క్రికెటర్ అలా చెప్పడంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుందని అనుకుంటున్నారంతా.
ఈ ఏడాది ఆగష్టులో శుభ్‌మన్, సారా ఆలీ ఖాన్ ఒక రెస్టారెంట్లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా, శుభ్‌మన్ మధ్య ప్రేమాయాణం నడుస్తున్నాయనే రూమర్స్ వచ్చాయి. సారా కూడా సహనటుడు కార్తిక్ ఆర్యన్‌తో డేటింగ్లో ఉన్నారనే గాసిప్స్ నడిచాయి. శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం గుజరాతో టైటన్స్ జట్టులో సభ్యుడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కి ప్రాతినిధ్యం వహించాడు.