Matthew Breetzke | లాహోర్ : ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ వరుస విజయాలతో అదరగొడుతోంది. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు అరంగేట్ర కుర్రాడు మాథ్యూ బ్రిట్జ్కె (148 బంతుల్లో 150, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రికార్డు శతకంతో చెలరేగగా మల్డర్ (64) రాణించడంతో ఆ జట్టు 50 ఓవర్లలో 304/6 స్కోరు చేసింది.
అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక స్కోరు(150) చేసిన బ్యాటర్‌గా బ్రిట్జ్కే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో 47 ఏండ్ల క్రితం హేన్స్(148) నమోదు చేసిన రికార్డును బ్రిట్జ్కె తిరుగరాశాడు. నిర్దేశిత లక్ష్యాన్ని కివీస్ 48.4 ఓవర్లలో పూర్తిచేసింది. విలియమ్సన్ (133 నాటౌట్)సూపర్ సెంచరీతో చెలరేగాడు.