దుబాయ్: క్రికెట్లో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇప్పటికే గత ఐసీసీ మెగాటోర్నీలను మహిళలతో విజయవంతంగా నిర్వహించిన ఐసీసీ..త్వరలో ఇంగ్లండ్, వేల్స్ వేదికలుగా జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం మొత్తం 18 మంది మహిళలతో కూడిన జట్టును ప్రకటించింది.
ఇందులో 14 మంది అంపైర్లు, నలుగురు మ్యాచ్ రిఫరీలు ఉన్నట్లు ఐసీసీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం మహిళలతో నిర్వహిస్తున్న మూడో టోర్నీగా ఇది రికార్డుల్లోకెక్కనుంది. భారత్ నుంచి రిఫరీ జీఎస్ లక్ష్మితో పాటు అంపైర్లు జనని, వృందా రాఠి, గాయత్రీ వేణుగోపాలన్ ఉన్నారు.