ఢిల్లీ : భారత బాక్సింగ్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్కు తన జూనియర్ బాక్సర్తో అక్రమ సంబంధాలున్నాయని ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలు చేశాడు. కరుంగ్ తనను మోసం చేశాడని వ్యాఖ్యానించిన కోమ్ ఆరోపణలపై అతడు స్పందిస్తూ.. ‘ఆమె నేను రూ. 5 కోట్లు మోసం చేశానని చెప్పింది. నా బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు ఢిల్లీలో ఒక అద్దె గదిలో నివాసముంటున్నా. ప్రస్తుతం ఆమె నడుపుతున్న అకాడమీకి విత్తనం వేసిందెవరు? కానీ ఇప్పుడు దానికి చీఫ్గా ఎవరున్నారు? 2013లోనే ఆమెకు ఓ జూనియర్ బాక్సర్తో అఫైర్ ఉండేది.
2017 నుంచి ఆమె అకాడమీలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నది. అందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి. ఇన్ని తెలిసినా నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. మేం కోమ్ సంప్రదాయ పద్ధతుల ప్రకారం విడాకులు తీసుకున్నామే తప్ప కోర్టు నుంచి తీసుకోలేదు. అయినా నేను కోర్టుకు వెళ్లాలనుకోవడం లేదు. నాకు నా పిల్లలు ముఖ్యం. ఆమె సెలబ్రిటీ కాబట్టి తను ఏం చెప్పినా జనం వింటున్నారు. కానీ నామీద చేసిన ఆరోపణలు నిరాధారం. వాటికి రుజువులు చూపించి మాట్లాడాలి. నేను ఆమెను మోసం చేయలేదు. కానీ తను నన్ను వాడుకుని వదిలేసింది. నేను ఆమెను క్షమిస్తానేమో గానీ కోమ్ చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ మరిచిపోను’ అంటూ ఘాటుగా స్పందించాడు.