Mary Kom : ప్రముఖ బాక్సర్, ఒలంపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ మేరీ కోమ్పై ఆమె మాజీ భర్త కరుంగ్ ఓన్ఖోలర్ (ఓన్లెర్) సంచలన ఆరోపణలు చేశారు. మేరీ కోమ్కు వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నాడు. మరోవైపు ఓన్లెర్ తనను ఆర్థికంగా మోసం చేశాడని, అతడు చెడ్డవాడని మేరీకోమ్ చేసిన ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చాడు. తాను మోసం చేసినట్లు ఆధారాలుంటే చూపాలని, తన బ్యాంకు ఖాతాల్ని కూడా చెక్ చేసుకోవచ్చని చెప్పాడు.
మేరీకోమ్-ఓన్లెర్ దంపతులు విడాకులు తీసుకున్నట్లు ఇటీవలే తెలిపారు. ఈ అంశంపై మేరీకోమ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తన మాజీ భర్త ఓన్లెర్ పై సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన ఆయన మేరీకోమ్ జీవితంపై తీవ్ర విమర్శలు చేశారు. మేరీ కోమ్కు 2013లోనే వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసిందని.. దీంతో అప్పట్లోనే తమ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిందని, కానీ, తాను చివరకు కాంప్రమైజ్ అయ్యానని ఓన్లెర్ చెప్పాడు. అప్పట్లో తన జూనియర్ తో వివాహేతర సంబంధం కొనసాగించిందన్నాడు. అంతేకాదు.. 2017లో మేరీకోమ్ బాక్సింగ్ అకాడమీకి చెందిన మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం కొనసాగించిందని, వారిద్దరి వాట్సాప్ చాట్ కు సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నాడు. అయినప్పటికీ ఇప్పటిదాకా ఈ అంశంపై మౌనంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
మేరీకోమ్ తన నుంచి దూరంగా వెళ్లిపోవచ్చని.. కానీ, తనపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన విమర్శించారు. 18 ఏళ్లు తనతో కలిసి వైవాహిక జీవితంలో ఉన్నప్పటికీ.. తనకు సొంతిల్లు కూడా లేదని, ఢిల్లీలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నానని ఆవేదన చెందాడు. తనకేం మిగలలేదని, తన లైఫ్ స్టైల్ చూడాలని కోరాడు. తను ఎప్పటికీ ఆమెను క్షమించబోనని చెప్పాడు. ఇద్దరూ తమ తెగ సంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్నామని, కానీ, చట్టపరంగా విడాకులు రావాల్సి ఉందని ఓన్లెర్ తెలిపాడు.