IPL 2025 : ఫామ్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(50) హాఫ్ సెంచరీ బాదాడు. స్టార్క్ వేసిన 9వ ఓవర్ ఆఖరి బంతికి డబుల్స్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఉతికారేసిన మర్క్రమ్ 30 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ శతకం సాధించాడు. మరో ఎండ్లో మిచెల్ మార్ష్(32) సైతం ధాటిగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు స్కోర్.. 82-0.
టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకుని పెద్ద తప్పిదమే చేసింది. సొంతగడ్డపై లక్నో ఓపెనర్లు మర్క్రమ్(50), మిచెల్ మార్ష్(32)లు చెలరేగి ఆడుతున్నారు. ముకేశ్, స్టార్క్ బౌలింగ్లో బౌండరీలతో విరుచుకుపడ్డ మర్క్రమ్ 30 బంతుల్లోనే ఫిఫ్టీతో మెరిశాడు. వీళ్లిద్దరి జోరుతో పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 51 రన్స్ కొట్టిన లక్నో.. ఓపెనర్లు మరింత ధాటిగా ఆడుతున్నారు.